CM Chandrababu cancels aerial survey: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే రద్దు అయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే రద్దు అయింది. ఆహారం పంపిణీ, పారిశుద్ధ్యంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
పారిశుద్ధ్యం, వైద్యసాయం సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. బస్తీలు, ఇళ్లల్లో బురదను తొలగించే పనులు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, విజయవాడలో కృష్ణమ్మ ఇప్పడిప్పుడే శాంతిస్తోంది. ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి నెమ్మదిగా తగ్గతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.81 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.5 అడుగులుగా ఉండగా..రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాగా,సోమవారం రికార్డుస్థాయిలో 11 లక్షల క్యూసెక్కులుగా పైగా ప్రవాహం రావడంతో బెజవాడ వాసులు వణికిపోయారు.