రాష్ట్రంలో ఐటీ, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

-

రాష్ట్రంలో ఐటీ, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరు అయ్యారు. ఏపీలో డ్రోన్ల ఉత్పత్తికి సంబంధిత రంగాల పరిశ్రమల కోసం ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని కేటాయించిన సీఎం.. మొత్తం 35 వేల మందిని డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను కల్పించాల్సిందిగా సూచించారు.

అయితే ఇప్పటికే ఏపీ డ్రోన్ కార్పోరేషన్ రాష్ట్రంలో సర్టిఫికేషన్ ఏజెన్సీగా మారేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈ సమీక్షలో సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు. వివిధ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో సెమీ కండక్టర్ల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశం జారీ చేసారు. అలాగే ఈ విధానాలను కేబినెట్ ముందు ఉంచాల్సిందిగా చంద్రబాబు అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version