నడవలేని స్థితిలో ఉన్నానని వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదని విజయవాడ సీఎమ్ఎమ్ కోర్టుక ఆయన తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు ధర్మాసనం 12 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కోర్టులో పోసాని తరపున వాదనలు వినిపించారు. తనకు రెండు సార్లు గుండె చికత్సలు జరిగాయని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని, ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వడంలేదని తెలిపారు. నడవలేని స్థితిలో తాను ఉన్నానని కోర్టుకు పోసాని తెలిపారు. దీంతో పోసాని స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో ఆయనపై 30 ఫిర్యాదు అందాయి. 17 చోట్ల కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆయనను అరెస్ట్ చేశారు. రిమాండ్లకు తరలించారు. దీంతో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు.