ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉగాదికి ఉచిత బస్సు అందుబాటులోకి తీసుకువచ్చేలా… ఈ కేబినేట్ సమావేశంలో చర్చించే ఛాన్సు ఉంది అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 7న మంత్రివర్గం భేటి కానుంది. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి 5లోగా పంపించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.