నేడు ఏపీ కేబినెట్ భేటీ… ఉచిత ఆర్టీసీ బస్సుపై కీలక ప్రకటన !

-

 

నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా ఉచిత ఆర్టీసీ బస్సుపై కీలక ప్రకటన రానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం ఉంటుంది. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ కేబినెట్ భేటీ చర్చ జరుగనుంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

CM Chandrababu Naidu to chair key Cabinet meeting

అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదలకు ఆమోద ముద్ర వేయనుంది ఏపీ మంత్రి వర్గం. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై చర్చించనున్న కేబినెట్… రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చ, పరిశ్రమల స్థాపనకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version