నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..!

-

నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

CM Chandrababu Naidu will participate in the pension distribution program in Yallamanda of Narasa Raopet mandal

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి…పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి దర్శించుకోనున్నారు చంద్రబాబు, పలువురు మంత్రులు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version