నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజన్ 2047 విడుదల చేయనున్నారు చంద్రబాబు. సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఇవాళ ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయి. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. 24 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
ఇక దీనిపై చంద్రబాబు మాట్లాడారు. 2047 విజన్ డాక్యుమెంట్ తయారుచేసి సెలక్ట్ అయిన మూడు జిల్లాలకు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. ఆరునెలల్లో విధ్వంసం నుంచీ వికాసం వైపు నడిపామని… పాలన వేగం పెరగాలన్నారు. అధికారులు అందరూ మార్పు చూపించాలి..ఎంత సింపుల్ గా ఉంటే అంత ప్రజలు ప్రశంసిస్తారని వివరించారు. రెడ్, గ్రీన్ కార్పెట్లు ఎక్కడా ఉండవు…అర్జీలతో ప్రజలు మీ దగ్గరకు వస్తే.. ఎక్కడో పరిపాలనా లోపం ఉన్నట్టే అని తెలిపారు. ప్రజల్లో పాజిటివ్ వాతావరణం తీసుకురావాలని కోరారు. డబ్బులు అవసరం.. వినూత్నంగా పని చేయడం కూడా చాలా ముఖ్యమని వివరించారు.