సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయను న్నారు చంద్రబాబు నాయుడు.
ఇక ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు యనమల ప్రకటన చేశారు. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సభా నిర్వహణ విషయంలో కీలకాంశాలను ప్రస్తావించిన యమమల…. పూర్తి స్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు.
ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుందని.. గడువు ముగిసేలోగా బడ్దెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు ఆమోదం లేకుంటే ప్రభుత్వం ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేయలేదన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమో లేక ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచన ఉన్నట్టు కన్పిస్తోందని తెలిపారు.