ఈనెల 19న వెయ్యి మందికి పైగా మరోసారి సీయూఈటీ-యూజీ పరీక్ష

-

ఈ నెల 19వ తేదీన వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు మరోసారి సీయూఈటీ-యూజీ పరీక్షను నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రోజున నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరీక్షా కేంద్రంలో తొలుత తాము ఎంపిక చేసుకోని భాషలో ప్రశ్నపత్రాలు పంపిణీ చేశారని, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకొని సరైనవి ఇచ్చారని కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనివల్ల సమయం వృథా అయిందంటూ అందిన ఫిర్యాదులతో ఎన్‌టీఏ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వారికి మరోసారి పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ వెయ్యి మంది అభ్యర్థులు ఆరు రాష్ట్రాలకు చెందినవారని తెలిపాయి. ఇదిలా ఉండగా జూన్‌ 30వ తేదీన విడుదల కావాల్సిన సీయూఈటీ – యూజీ ఫలితాలు ఇప్పటివరకూ వెల్లడి కాకపోవడం గమనార్హం. నీట్, నెట్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీయూఈటీ-యూజీ ఫలితాల విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. వాటి విడుదలపై స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version