అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త

-

CM Chandrababu: అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు….అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదన్నారు. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందని వివరించారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందుకు రావాలని కోరారు.

CM Chandrababu’s good news on Anna canteens

అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని ప్రకటించారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే ఇప్పుడుండే జైళ్లు, ఆసుపత్రులు కూడా చాలనంతగా నేరాలు పెరిగిపోతాయన్నారు. దైవసేవతో పాటు మానవ సేవనూ హరేకృష్ణ సంస్థ సమానంగా చేస్తోందని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఇస్కాన్, హరేకృష్ణ సంస్థలు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version