సీఎం చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది : మేరుగు నాగార్జున

-

కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.  తాజాగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. మాట తప్పి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఈ ఆరు నెలల్లో రూ.15,485 కోట్ల మేరా ప్రజలపై విద్యుత్ బారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు.. మాట తప్పి నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఆరు నెలల్లో 15, 485 కోట్ల మేరకు ప్రజలపై విద్యుత్ భారం పడింది. గత ప్రభుత్వ హాయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version