నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారట సీఎం చంద్రబాబు. మహిళల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారట. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

ఉదయం 10.45 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మార్కాపురానికి చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం స్టాళ్ల ప్రదర్శనను పరిశీలించడంతో పాటు లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను పంపిణీ చేస్తారు. అనంతరం జిల్లా నాయకులు, అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు.
ఇక అటు ఏపీ ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ సేవలు బంద్ కానున్నాయి. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల సంఘం వెల్లడించింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని.. ఆస్పత్రుల నెలవారీ నిర్వహణ చేయలేకపోతున్నామని తెలిపింది.