ఏపీ: ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ సేవలు బంద్ కానున్నాయి. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నేటి (శనివారం) నుంచి నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల సంఘం వెల్లడించింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని.. ఆస్పత్రుల నెలవారీ నిర్వహణ చేయలేకపోతున్నామని తెలిపింది.

ఇప్పటికే తాము ట్రస్ట్, ప్రభుత్వంతో పలుమార్లు చర్చించామని.. బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై సృష్టత లేదని పేర్కొంది.