ఇవాళ ప్రకాశం జిల్లాకు ఏపీలోని బడా లీడర్లు రానున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు మూడు పార్టీల అధినేతల పర్యటనలు కొనసాగనున్నాయి. ఇవాళ ప్రకారం జిల్లాలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్..పర్యటించనున్నారు. కనిగిరిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్.
అటు పొదిలిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గిద్దలూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో ఏపీ రాజకీయాలు వేడేక్కాయి. అటు నేడు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు క్రోసూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్… మధ్యాహ్నం ఒంటిగంట నుంచి , రెండు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్.