ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగుకు సీఎం వైయస్‌.జగన్‌ శ్రీకారం

-

ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగుకు సీఎం వైయస్‌.జగన్‌ శ్రీకారం చుట్టారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షల నిర్వహణ ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈటీఎస్‌ తరపున ఒప్పందంపై సంతకాలు చేశారు LEJO SAM OOMMEN, Chief Revenue Officer, ETS India, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు.

ఈ సందర్భంగా వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు అన్నారు. వారి జీవితాల్లో మార్పుతేవడం ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తే దేవుడి దృష్టిలో వారి కుటుంబాలకు గొప్ప సేవచేసినవాళ్లం అవుతాం. మనం ఏ కార్యక్రమం చేసినా… అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదొక సవాల్‌తో కూడిన కార్యక్రమం అని వివరించారు. మీరు చేపడుతున్న కార్యక్రమాన్ని కేవలం జూనియర్‌ లెవెల్‌కే పరిమితం చేయకుండా… ప్లస్‌ వన్, ప్లస్‌ టూ సీనియర్‌ లెవెల్‌ వరకూ విస్తరించాలి.11, 12 తరగతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల కోసం అప్పుడే విదేశాలకు వెళ్తారు. అందుకే జూనియర్‌ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్‌ లెవెల్‌ వరకూ విస్తరించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version