సీఎం జగన్…మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ ఆంబులెన్స్ కు దారి ఇచ్చారు సీఎం జగన్. మేమంతా సిద్ధం యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వెళ్తుండగా బత్తులూరు వద్ద ఆంబులెన్స్‌కు దారి ఇచ్చిన జగన్… మరోసారి మానవత్వం చాటుకున్నారు. కాగా, చంద్రబాబు వయస్సుపై జగన్ సెటైర్లు వేశారు. 75 ఏళ్లు ఉండి ఏం పీకాడంటూ ఫైర్ అయ్యారు.
ఎర్రగుంట్లలో జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… నాకంటే ముందు 75 ఏళ్ల చంద్రబాబు సీఎంగా వున్నారు…14 ఏళ్ళు సీఎంగా ఉండి.. ఏం చేశారని నిలదీశారు. నేను చిన్నవాన్ని… చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన ఏరోజైన చేశాడా ? అంటూ నిప్పులు చెరిగారు. ఎర్రగుంట్లలోనే 93 శాతం మందికి లబ్ది చేకూరిందన్నారు. మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగింది..మార్పు కొనసాగడం అవసరమని నిలదీశారు.