NDA కూటమికే ప్రజల మద్దతు.. లేటెస్ట్ సర్వేలో ఏం తేలిందంటే?

-

రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రజల మద్దతు ఎవరికి ఉంది? అనే విషయాలు తెలుసుకునేందుకు మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ నిర్వహించిన డిజిటల్ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమే మరోసారి ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి 27వ తేదీల మధ్య నిర్వహించిన డిజిటల్ సర్వేలో 7.59 లక్షల మంది పాల్గొనగా.. అందులో 79 శాతం మంది ఎన్డీయే కూటమికే మద్దతిస్తామని వెల్లడించారు. మిగిలినవారు ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ వైపు వెళ్లారు.

అయోధ్య రామమందిర వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని మోదీ ప్రభుత్వం అతిపెద్ద విజయంగా ప్రజలు అభివర్ణించారు. మోదీ చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ ఇనిషియేటివ్ ఎంతో గొప్పదని తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనియాడారు. దేశవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 57.16 శాతం మంది ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రామమందిరమే కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. మరో 31.16 శాతం మంది ఇతరత్రా అంశాలు ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version