CM Jagan : రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్

-

సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. బుధవారం సాయంత్రం 5:20 గంటలకు తాడేపల్లి నుంచి స్టేడియానికి చేరుకొని వేడుకలు, హై-టీలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

CM Jagan will be in Vijayawada tomorrow

కాగా, రేషన్ కార్డులు ఉన్నవారికి సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకు తరలించారు. కేజీ రూ. 67 చొప్పున అందించనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా…జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అటు తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరాఫరా చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version