BREAKING: పులివెందుల బయలు దేరనున్నారు సీఎం జగన్. ఇవాళ పులివెందులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనం అవుతారు. ఈ సందర్భంగా సీఎం జగన్ బందోబస్తు , ఎన్నికల విధులలో తీసుకోవాల్సిన చర్యలను పోలీసు సిబ్బందికి తెలియజేశారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్. పులివెందుల నియోజకవర్గం ఎన్నికల విధుల్లో ఆక్టోపస్ ఎస్పీ రవి చంద్ర, తమిళనాడు గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఉంటారని తెలిపారు.
ఇవాళ రాత్రికి సీఎం జగన్ పులివెందులలో బస చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందికి ఎస్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక అటు ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కు సర్వం సిద్ధం చేశామన్నారు కడప ఆర్వో మధుసూదన్. వర్షం వచ్చినా ఈవీఎంలు తడవకుండా ప్లాన్ బి అమలు చేస్తున్నామని వివరించారు. ముందస్తుగా ఈవీఎంలను ప్లాస్టిక్ కవర్లలో భద్రపరుస్తున్నాం…కడప అసెంబ్లీ పరిధిలో 59 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు కడప ఆర్వో మధుసూదన్. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో కేంద్రపు బలగాలతో భద్రతాచార్యులు చేపడుతున్నాం…ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.