విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. రాప్తాడు వైసీపీ సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా మనకు..? చంద్రబాబు పేరు చెప్పితే ఒక్క పథకమైన గుర్తుకొస్తుందా. చంద్రబాబు 14 ఏళ్ల పాలన లో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒకటైన ఉందా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టిడిపిని 23 సీట్లకే పరిమితమన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పుతు తెచ్చామన్నారు.
చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవ్వరికీ గుర్తుకు రాదు. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టో 10 శాతమైనా అమలు చేశారా..? అని ప్రశ్నించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా..? అన్నారు. మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా నాడు-నేడుతో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మేనిఫెస్టో మాయం చేసి.. హామీలను ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు.. చుక్కల్ని కూడా దింపుతా అంటాడు. ఎగ్గొట్టే వాడు.. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు.