ఇప్పటికే టమోటా, పచ్చిమిర్చి ధరలు పెరగడంతో సామాన్యులు వాటిని వాడటం మానేశారు. వీటితో పనిలేకుండా ఉండే కూరలు చేసుకుంటున్నారు. ఏ కూరలో అయినా ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఉల్లి ధరలు కూడా పెరగనున్నాయి. టమోటా దారిలోనే ఉల్లి వెళ్లబోతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఈ నెలాఖరుకు ఉల్లిధరలు భారీగా పెరిగే అవకాశం ఉందట.
అయితే… ఉల్లి ధర కిలో రూ. 100కు చేరిన నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. ధరల నియంత్రణకు వీలుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 10 టన్నుల ఉల్లిని మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసింది. నో లాస్… నో ప్రాఫిట్ విధానంలో తోలుత నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని రైతు బజార్లలో కిలో రూ. 36కే ప్రజలకు పంపిణీ చేయనుంది. వినియోగదారులపై భారం పడకుండా త్వరలో అన్ని జిల్లాలకు ఉల్లిని సరాఫరా చేస్తామని అధికారులు తెలిపారు.