ఈ రోజు ఉదయమే బీసీసీఐ టీం ఇండియాకు షాకింగ్ విషయాన్ని తెలియచేసింది. గాయపడిన హార్దిక్ పాండ్య ఇక వరల్డ్ కప్ ఆడలేదని తేల్చి చెప్పేసింది. ఇది నిజంగా జీర్ణించుకోలేని విషయమని చెప్పాలి. ఎందుకంటే లీగ్ స్టేజ్ లో ఎలాగు వరుస మ్యాచ్ లను గెలుచుకుని సెమీస్ కు చేరుకున్నాము. కానీ ఇప్పుడే అసలైన పోటీ, ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్య లాంటి ఆల్ రౌండర్ జట్టుకు చాలా అవసరం. ఇక ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్ లలో టాప్ ఆర్డర్ తోనే పని అయిపోయింది. లోయర్ ఆర్డర్ క్లిష్ట సమయంలో ఏ విధంగా ఆడుతారు అన్నది కూడా టెస్ట్ జరగలేదు. సడెన్ గా సెమీస్ లో ఇలాంటి పరిస్థితి వస్తే… ఇండియాకు కష్టమేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఎందుకంటే రోహిత్, గిల్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు, కోహ్లీ , శ్రేయాస్, రాహుల్, సూర్య లు ఆడుతున్నారు..
కానీ ఆ తర్వాత జడేజా ఒక్కడే బ్యాటింగ్ బాధ్యతను తీసుకోవలసిన పరిస్థితి. ఒకవేళ టాప్ ఆర్డర్ సెమీస్ లో ఫెయిల్ అయితే జడేజా ఒక్కడే ఆదుకోగలడా ? అంటే చెప్పలేము. హార్దిక్ పాండ్య దూరం కావడం ఇండియాకు శాపమే.