నేడు, రేపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు ఏలూరు మినీ బైపాస్ రోడ్డులోని క్రాంతి కళ్యాణ మండపం నుండి బయలుదేరుతారు. ఏలూరు ఎన్.హెచ్16, కొవ్వూరు, గోదావరి గట్టు మీదుగా తాడిపూడి లిప్ట్ ఇరిగేషన్, చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్ మీదుగా 12.30 గంటలకు పోలవరం మండలం పట్టిసీమ యామిని కళ్యాణ మండపానికి చేరుకుంటారు.12.30 నుండి 1.30 గంటల వరకూ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు యామిని ఫంక్షన్ హాలు నుండి బయలుదేరి పట్టిసీమ లిప్ట్ ఇరిగేషన్ మీదుగా 3 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 4 గంటల వరకూ పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి తాడిపూడి, గోపాలపురం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు దేవరపల్లి డైమండ్ సెంటర్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి రాత్రి 6.30 గంటల వరకూ టి. జంక్షన్ వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటల వరకు టి.జంక్షన్లో బహిరంగ సభలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. అనంతరం దేవరపల్లి నుండి బయలుదేరి కొవ్వూరు, బొమ్మూరు మీదుగా రాత్రి 8.30 గంటలకు రాజమహేంద్రవరంలోని బివిఆర్ శ్రీ ఫంక్షన్ హాలుకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
ది.08-08-2023వ తేదీ మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం బివిఆర్ శ్రీ ఫంక్షన్ హాల్ నుండి మోరంపూడి, లాలాచెరువు జంక్షన్, కాతేరు మీదుగా మధ్యాహ్నం 1గంటకు సీతానగరం మండలం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-1 వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 వరకూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-1ను శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తమపట్నం గ్రామం నుండి బయలుదేరి సీతానగరం, రాపాక రోడ్, ఎడిఎ ఫీల్డ్స్, కోటికేశవరం, శ్రీరంగపట్నం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద నుండి రోడ్ షో ప్రారంభించి సాయంత్రం 4గంటలకు బస్టాండ్ సెంటరుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకూ అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకొండలో బయలుదేరి కత్తిపూడి, అనకాపల్లి, ఆనందపురం మీదుగా రాత్రి 10 గంటలకు విజయనగరంలోని అశోక్ బంగాళాకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.