చంద్రబాబు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి… ఈ ప్రాజె క్ట్ పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని సీఎం దృష్టికి తెచ్చారు అధికారులు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు తెలియజేశారు అధికారులు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తె లంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్ర యోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.