ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్ జైన్, శ్రీలక్ష్మి, పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ వంటివారు చంద్రబాబు రాగానే సచివాయలం మొదటి బ్లాక్ వద్దకు పరుగులు పెట్టారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా అజయ్ జైన్.. సీఐడీకి స్టేట్మెంట్ ఇచ్చారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారనే అభియోగాలు ఉన్నాయి. జగన్, సీఎంవో అధికారులతో కుముక్కె పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఆర్థికశాఖలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీ సత్యనారాయణపై అభియోగాలున్నాయి వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతించకపోవడంతో వెనుదిరిగినట్టు సమాచారం. కాసేపట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓం సమావేశం కానున్నారు.