కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు, వామపక్షాలు చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో బీజేపీతో బంధం తెంచుకోవడానికి కూడా కొన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయంsటే ఈ బిల్లు రైతుల పాలిట ఎంత ఇబ్బందిగా పారబోతుందనేది గమనించవచ్చనేది బలంగా వినిపిస్తోన్న మాట! ఆ సంగతులు అలాఉంటే… ఈ బిల్లు ప్రవేశపెట్టిన మోదీపై నారాయణ ఘాటు కామెంట్లు చేశారు!
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అనంతపురంలోని బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… వ్యవసాయ బిల్లులతో సన్న చిన్నకారు రైతులు పంటలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిని కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం మోడీని తగులుకున్న నారాయాణ… “సంసారం ఉండి పిల్లలున్న వారికైతే ఆ బాధ తెలుస్తుంది. అవేమీ లేని ప్రధాని మోదీకి ఏమి తెలుసు” అంటూ వ్యాఖ్యానించారు! ఆ సంగతులు అలా ఉంటే… ఈ విమర్శలపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది!
అయోధ్య రామమందిర పునాది పూజకు మోడీ తన భార్యతో కాకుండా ఒంటరిగానే చేశారుగా అని… జగన్ తిరుమల వ్యవహారంపై స్పందించిన కొడాలి నానిపై, ఏపీ బీజేపీ నేతలు తెగ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. వీరు చాలదన్నట్లుగా మోడీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదన్నట్లుగా టీడీపీ నేతలు కూడా ఫెర్ఫార్మ్ చేశారు! మరి ఇప్పుడు నారాయణ మోడీ సంసారం – పిల్లలు గురించి కూడా కామెంట్ చేశారు! అవేమీ లేనివాడికి రైతుల కష్టాలు ఏమి అర్ధం అవుతాయని ప్రశ్నించారు! మరి దీనిపై మోదీ మెప్పు పొందాలనే టీడీపీ నేతలు.. ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!!