“ఒకే దేశం-ఒకే ఎన్నికలు” సీపీఐ నారాయణ సెటైర్లు పేల్చారు. “ఇండియా” కూటమి సమావేశంతో భయపడుతున్న ప్రధాని మోడి… ముందస్తు ఎన్నికలు జరిపితే, ముందే ఇంటికి పోవడం జరుగుతుందని హెచ్చరించారు. దృష్టి ని మళ్ళించే ప్రయత్నం తప్పితే మరేదీ కాదని.. లీకేజీలు ఇచ్చి ప్రచారం చేసుకుని, దృష్టి మరలుస్తున్నారని మండిపడ్డారు.
జి-20 సమావేశాల పేరుతో “కమలం” గుర్తును ప్రచారం చేసుకుంటున్నారని… చంద్రమండంలో రోవర్ లాండ్ అయిన ప్రదేశానికి “శివశక్తి” అని పేరు పెట్టారని ఆగ్రహించారు. ఈ రకంగా వీలైన చోటల్లా మతాన్ని జోడించే ప్రయత్నాలు చేస్తున్నారని… ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకోడానికి మన దేశం కాదు చంద్ర మండలం అంటూ మండిపడ్డారు నారాయణ. వీలైన చోటల్లా మతాన్ని జోడించి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు….”ఒకే భాష, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే లీడర్” అన్నది వాళ్ల సిద్ధాంతమేనన్నారు సీపీఐ నారాయణ.