విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ వల్ల జరిగిన గొడవ కారణంగా… ఓ కుర్రాడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది.

ఈ కొట్లాటలో తీవ్రంగా గాయపడి కార్తీక్ అనే విద్యార్థి మృతి చెందాడు. బొబ్బిలి లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే స్కూల్ ముగిసిన తర్వాత క్రికెట్ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఇందులో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడని అంటున్నారు. ఇంతలోనే మరణించాడు అని చెబుతున్నారు.
ప్రాణం తీసిన క్రికెట్..
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాట.
కొట్లాటలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విద్యార్థి కార్తీక్.
బొబ్బిలిలోని ఓ ప్రైవేటు స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు.
క్రికెట్ విషయంలో ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవ. pic.twitter.com/DHvuRUBqpl— ChotaNews App (@ChotaNewsApp) July 15, 2025