గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో 28 శాతం క్రైమ్ రేటు తగ్గింది : హోంమంత్రి అనిత

-

వైసీపీ సోషల్ మీడియా వారియర్ల అరెస్టులపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఎవ్వడూ ఏమి చేయలేడులే అనుకుంటే.. సప్త సముద్రాలు దాటి ఉన్నా మిమ్మల్ని పట్టుకుంటామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసం జగన్ మాట్లాడుతున్నారు. జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారు. వైసీపీ హయాంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగాయి. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఐదు నెలల్లో ఏదోజరిగిపోయిందని అబాంఢాలు వేస్తున్నారు.

మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అనేక మందిపై కేసులు పెట్టారు. డీజీపీ ఆఫీస్ పక్కనున్న టీడీపీ ఆఫీస్ పై దాడి చేవాశారు. జగన్ మయాంలో పరదాలు పెట్టుకుని సమావేశాలు పెట్టుకున్నారు. సహానాను కొట్టి చంపారని వైద్యులే నిర్దారించారు. అత్యాచారాలు జరుగుతున్నాయని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నన్ను కులం పేరుతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. శాంతి భద్రతల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం. ఏపీ పరువు ప్రతిష్టను జగన్ ఎప్పుడో తీసేశారు. జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రశ్నించడమంటే జగన్ కు తెలుసా..? గత ప్రభుత్వంలో కంటే మా ప్రభుత్వ హయాంలో 28 శాతం క్రైమ్ రేటు తగ్గిందని తెలిపారు హోంమంత్రి అనిత. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version