సోషల్ మీడియాని ఉగ్రవాదుల కంటే ఎక్కువగా తీసుకోవాలి : హోంమంత్రి

-

పోలీసులను గత ప్రభుత్వంలో పోలీసు పని చేయనివ్వలేదు అని హోంమంత్రి అనిత అన్నారు. ఇప్పుడు మేం చేస్తున్న అరెస్టులు తప్పు కాదు. వర్రా రవీంద్రరెడ్డి అనే వెధవ పెట్టిన పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. తల్లికి, చెల్లికి దిక్కులేదు.. మేము, మా కుటుంబం ఎంత మీకు.. అదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. పంచ్ ప్రభాకర్ షర్మిళను షకీల అన్నపుడు ఎవరూ మాట్లాడలేదు. ఎవడో తెలీని ఇడియట్ మాట్లాడితే చేతులు కట్టుకు కూచోవాలా.

నేను గట్టిదాన్ని కాబట్టి సూసైడ్ చేసుకోలేదు. వెధవలను మేం పట్టుకొస్తున్నాం… అరెస్టు చేస్తున్నాం. ఇలాంటి వెధవలకు బెయిల్ ఇవ్వడానికి వార్ రూం ఏర్పాటు చేస్తారట. భావ స్వేచ్ఛా ప్రకటన కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సోషల్ మీడియా ని ఉగ్రవాదుల కంటే ఎక్కువగా తీసుకోవాలి. పేట్రేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎవరినీ వదలం. దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావడానికి సిద్ధమయ్యాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తాం అని హోంమంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version