పులివెందులలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ZPTC ఉపఎన్నిక నేపథ్యంలో కీలక సెంటర్లలో దుకాణాలు మూసివేసారు. మెడికల్ షాపులకు తప్ప.. మిగిలిన వ్యాపారాలు బంద్ అయ్యాయి. ప్రధాన సెంటర్లలో అల్లర్లు, ఘర్షణలు జరగకుండా దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

అటు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల పోలింగ్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి కడపకు బయలుదేరారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద వీరి వాహనాన్ని అడ్డుకున్నారు.