ఆశా వర్కర్లకు వరాలు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆశా వర్కర్లకు వరాలు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు. ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలు ఫిక్స్ చేశారు.

సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే రూ. 5 వేలు చెల్లించనున్నారు. గరిష్టంగా మొత్తం రూ లక్షన్నర వరకు చెల్లించనున్నారు. రిటైర్‌మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.