ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ రోజు గరిష్ట స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో కేవలం 41,713 కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే.. ఏకంగా 10,057 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంటే ప్రతి నలుగురి కి కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తే అందులో ఒకరు కరోనా బరినా పడ్డారు. రాష్ట్రంలో నిన్నటి కంటే కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. నిన్న రాష్ట్రంలో 6,996 కేసులు నమోదు అయ్యాయి. అంటే నిన్నటి తో పోలిస్తే.. నేడు రాష్ట్రంలో 3,061 కేసులు పెరిగాయి.
అలాగే మరణాలు కూడా ఈ రోజు గరిష్టం గా పెరిగియి. గడిచిన 24 గంటలలోనే 8 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం కూడా దాదాపు 6 నుంచి 7 నెలల తర్వాత ఇదే మొదటి సారి. కాగ రాష్ట్రంలో నేడు 10,057 కేసులు నమోదు అవుతే.. కేవలం 1,222 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విశాఖపట్నలో 1,827 కేసులు చిత్తురు జిల్లాలో 1,822 కేసులు నమోదు అయ్యాయి.