మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తీరంలో సముద్రం పోటెత్తుతోంది. తుఫాను తీరం దాటే సమయానికి సముద్ర జలాలు జనవాసాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టులకు 10 నెంబర్, కాకినాడకు 9, విశాఖ, కళింగపట్నం పోర్టులకు మూడవ నెంబర్ హెచ్చరికలు జారీచేశారు.
ఇక హైదరాబాద్, రేణిగుంట, విశాఖ, చెన్నై ఎయిర్ పోర్టుల్లో పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. కాగా, నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్.. బీ.వి. నగర్.. సుందరయ్య కాలనీ.. వెంకటేశ్వరపురం…వై.ఎస్.ఆర్. కాలనీ తదితర ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి నెల్లూరు నగరానికి ప్రవేశించే మార్గంలో భారీగా నీరు చేయడంతో ఒక మార్గం లోనే వాహనాలను అనుమతిస్తున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో… వాటిని తొలగించి రాకపోకలకను క్రమబద్ధీకరిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో… పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ టవర్లు పనిచేయడం లేదు.