కారు డ్రైవర్ ను తిట్టడంపై దెందులూరు టీడీపీ పార్టీ MLA చింతమనేని ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలో కావాలని నా కారుకి మాజీ MLA కారు అడ్డుపెట్టి కావాలని కవ్వించారని ఆగ్రహించారు. ఉనికి కాపాడుకోడానికి కావాలని రాద్ధాంతం చేయాలని చూశారని మండిపడ్డారు దెందులూరు టీడీపీ పార్టీ MLA చింతమనేని ప్రభాకర్.
నా దారికి అడ్డుగా మరో కారు ఉంచడంతో డ్రైవర్ ను తిట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు దెందులూరు టీడీపీ పార్టీ MLA చింతమనేని ప్రభాకర్. నా కారుకు వైసిపి వాళ్ల కారు అడ్డు పెట్టలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అయితే… దెందులూరు టీడీపీ పార్టీ MLA చింతమనేని ప్రభాకర్ పచ్చి బూతులు తిట్టడంపై వైసీపీ పార్టీ మాత్రం సీరియస్ అవుతోంది.