ఒంగోల్ ఆవు కి రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జాతి పశువుల పేరు ఎత్తగానే జంతు ప్రేమికుల కల్ల ఎదుట విలవిలా మెరిసే తెల్లని శరీరము, చలి, వేడిని తట్టుకునే శరీరతత్ము సూపర్ లను ఆకట్టుకునే మూపురము, రంకెల్లో రాజసం కనిపిస్తాయి. ఇవి ఆకారంలో చాలా పెద్దవిగాను, బలిష్టంగా ఉంటాయి. చక్కగా మచ్చ కయ్యే గుణం కలిగి ఉంటాయి. ఒంగోలు జాతి పశువులు మంచి ఎముకపుష్టి కలిగి ఏపుగా ఎదిగి.. ఆహారము వాతావరణం భూసారం అనుకూలించడంతో ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకొని నిలబడగలిగే రోగనిరోధక శక్తిని కూడా కలిగి ఉంటాయి. బరువులు లాగడం, పాల ఉత్పత్తులకు ఈ జాతిలో ప్రపంచంతో మరో జాతి పోటీ పడలేదు. వ్యవసాయం చేయడంలో ఒంగోలు జాతి గిత్తలు మంచి పేరు సంపాదించాయి.


ఈ సరణంలోనే ఒంగోలు జాతి ఆవులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు జాతి గిత్తలు, ఆవులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల బ్రెజిల్ లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతికి చెందిన వయాటిన -19 అనే ఆవు రూ.41 కోట్లు పలకడం శుభపరిణామమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. ఆ జాతి గిత్తలు ఉన్నతమైనవని.. ఫలానికి ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version