అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ “ఇంటర్ సర్వీసెస్
ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)”తో సంబంధాలు ఉన్న ఒక సంస్థలో
ఉద్యోగం చేస్తోందని హిమంత శర్మ ఆరోపించారు.
ప్రత్యక్షంగా ఎవరి పేరు చెప్పకుండా బుధవారం నుంచి వరసగా ఎక్స్ ట్వీట్స్ లో విరుచుకుపడుతున్నారు. భారతదేశం అభ్యంతరం చెప్పినప్పటికీ 2015లో పాకిస్తాన్ హైకమిషనర్తో గౌరవ్ గొగోయ్ సమావేశం కావడాన్ని కూడా ఆయన విమర్శించారు. అయితే, ఈ ఆరోపణపై కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ స్పందించారు. ఈ ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. 2026 అస్సాం ఎన్నికల ముందు తనపై తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు. ఈ
వివాదానికి కేంద్ర బిందువుగా “ఎలిజబెత్ కోల్బర్న్” ఉంది.
2013లో గొగోయ్ ఈమెను అమెరికాలో కలిసిన తర్వాత
వీరిద్దరు వివాహం చేసుకున్నారు. లిజబెత్ 2011-2015 మధ్య క్లైమేట్ డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్ నెట్వర్క్ తో
పని చేశారు. దీనికి ఎక్కువగా పాకిస్తాన్తో సంబంధాలు
ఉన్నాయి. ఆమె పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ మాజీ సలహాదారు, ఐఎస్ఐతో సంబంధం ఉన్న అలీ తౌకీర్ షేక్ కింద పనిచేశారని బీజేపీ ఆరోపించింది.