కక్ష పూరితంగా అయితే నెల రోజుల్లోనే లోపల వేయించే వాళ్లం : మంత్రి కొల్లు రవీంద్ర

-

కక్ష పూరితంగా అయితే నెల రోజుల్లోనే లోపల వేయించే వాళ్లమని  మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో తప్పు నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ మరోనేరానికి పాల్పడ్డారని తెలిపారు. గతంలో వైసీపీ నేతలు, అధికారం అండతో కృష్ణా జిల్లాలో పెట్రేగిపోయారని తెలిపారు.

” ఒక నాయకుడు క్యాసినో పెట్టి నోరు ఉంది కదా అని బూతులు తిట్టాడు. మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించాడు. ఇంకో నాయకుడు పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడ్డాడు. ఈ చర్యలు అన్నింటిని ఉపేక్షించాలా..?  కక్షపూరితంగా చేయాలనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించే వాళ్లం” అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పలువురు టీడీపీ నేతలు వల్లభనేని వంశీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version