సజ్జల ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సజ్జల కుటుంబం రిజర్వు ఫారెస్ట్ భూముల ఆక్రమణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అటవీ భూముల ఆక్రమణ పై తక్షణం విచారణ చేపట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏ ఏ వన్యప్రాణులకు హాని జరిగిందో నివేదిక ఇవ్వాలని పిసిసిఎఫ్ ను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
దీంతో అటవీ భూముల ఆక్రమణ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్ కు ఆదేశించారు. సజ్జల కుటుంబం ఆక్రమించిన భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయా ? ఎన్ని ఎకరాలు అక్రమించారో నీగ్గు తేల్చాలని ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి ? ఎవరు స్వాధీనం చేసుకున్నారు ? విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీంతో సజ్జల ఫ్యామిలీలో గుబులు నెలకొంది.