ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి ప్రారంభం అయ్యాయి. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ప్రసగించారు. జాతీయ ఉపాధి హామీ పధకంలో పనిచేసే వారికి 15 రోజుల్లోపు మీకు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వారికి 8100 రూపాయలు నెలకు ఇస్తామని ప్రకటించారు.
నెల రోజుల్లోపు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. కంకిపాడు-రొయ్యూరు వయా గూడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నానని ప్రకటించారు. నిదురుమొండి నుంచీ బ్రహ్మయ్యగారి మూలం, నాగాయలంక వరకూ గ్రామాల ప్రజలు వరద బారిన పడ్డారని కలెక్టర్ తెలిపిన ప్రకారం రోడ్లు వేయాలని పంచాయతిరాజ్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ గ్రామంలో నీటి అవసరాలు ఉన్నాయని ఎంఎల్ఏ తెలిపారన్నారు. పంచాయితీ రాజ్ శాఖ డబ్బులు ఎటెళ్ళిపోయాయో గత ప్రభుత్వంలో తెలీదు…మేం అన్నీ బహిర్గతం చేస్తున్నాం.. మేం చెపుతున్న పనులు ప్రజలు తీర్మానం చేసినవని తెలిపారు.