ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా బిజీ బిజీ అనే చెప్పాలి. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిస్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ మూడో రోజు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.

వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకు ముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు విజయవాడకు ప్రయాణం కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version