వరద తగ్గగానే ఫ్లడ్ కెనాల్స్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తాం. అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయి. విజయవాడపై ప్రత్యేక కోణంలో దృష్టి పెట్టాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రేపటికి ప్రకాశం బ్యారేజి 5 లక్షలకి తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. ఇది ఒక ప్రకృతి విపత్తు. ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే ఈ విపత్తు దురదృష్టకరం అని పేర్కొన్నారు. రెండు రోజులుగా పంచాయితీరాజ్ నుంచిజ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ వర్షాలు బుడమేరుకు రావడం నష్టానికి కారణం అని తెలిపారు.
అలాగే చిన్న చిన్న వాటిని కూడా గత ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయలేకపోయింది. ప్రస్తుతం 262 టీంలను ఏర్పాటు చేసాం. చనిపోయిన 12 మంది కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. 176 రీహేబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసాం. 193 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసాం. 5 లక్షలకు పైగా ప్రజలు నష్టపోయారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అందరం సహాయ కార్యక్రమాలలో పని చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పని చేస్తాం. 72 గంటలుగా నిద్ర కూడా లేకుండా అందరూ పని చేస్తున్నారు. రాష్ట్ర హితవు కోరుకునే మూడు పార్టీల వ్యక్తులు పని చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.