Deputy CM Pawan Kalyan Riding Battery Cycle: AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ లో కనిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైకిల్ నడిపారు. అతి తక్కువ ఖర్చు, బ్యాటరీతో నడిచే సైకిల్‌ను విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ రూపొందించారు.

వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపమిచ్చిన విద్యార్థిని మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో సిద్ధూ ఆవిష్కరించిన సైకిల్ని స్వయంగా నడిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సిద్ధూని అభినందిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.