ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. వితంతువులకు చీరలు పంపించి.. అందరినీ ఆకట్టుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాఖి కానుకగా పిఠాపురానికి సంబంధించిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించారు.

ఒక్కో చీర వెయ్యి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుచరులు ఈ 1500 మంది వితంతు మహిళలకు చీరలను పంపించారు.