తెలంగాణ మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తనకు ఈ రాజకీయాలు వద్దే వద్దంటూ… కీలక ప్రకటన చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పకనే చెప్పారు.

కాలేజీలు నడుపుకుంటూ ప్రజాసేవ చేస్తానని ప్రకటించారు. తనకు ఇప్పటికే 73 సంవత్సరాలు పూర్తయ్యాయని.. పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యులుగా అలాగే మంత్రి పదవి ఇలా అన్ని అనుభవించానని గుర్తు చేశారు. ఇప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. ఆయన కోడలుకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.