కడప జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళతారు. నేడు కడప నగరానికి బయలు దేరనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి నేరుగా కడప విమానశ్రయానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలోని మునిసిపల్ హైస్కూల్ కు చేరుకోననున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మునిసిపల్ హైస్కూల్ నందు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు డిప్యూటీ సీఎం పవన్. మున్సిపల్ హై స్కూల్ తరగతి గదులను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం…6,7,8,9,10 వ తరగతి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. విద్య, వికాసం పై చర్చించునున్న డిప్యూటీ సీఎం…విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. అనంతరం కడప నుంచి హైదరాబాద్ వెళ్ళనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు అయింది.