తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటన చేశారు.
హోంగార్డ్‌లకు రోజువారీ జీతం రూ.921 నుంచి రూ.1000కి, విక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200 పెంచుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పోలీసుల పిల్లల చదువుల కోసం డీజీపీ నుండి హోంగార్డు పిల్లల వరకు ఒకే స్కూల్లో చదువుకునే లాగా ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాము అంటూ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అటు ఈ నెల 31లోగా నూతన టూరిజం పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.