ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. ఇవాళ మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ ను ప్రారంభించనున్నారు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. క్యాన్సర్ ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ ల లక్ష్యం.
క్యాన్సర్ ను ముందుగానే కనుగొని చికిత్స చేసేందుకు దోహదపడనున్నాయి ఈ వ్యాన్ లు. అయితే.. అలాంటి మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ ను ప్రారంభించనున్నారు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక అటు నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా ఉచిత ఆర్టీసీ బస్సుపై కీలక ప్రకటన రానుంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం ఉంటుంది. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ కేబినెట్ భేటీ చర్చ జరుగనుంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.