నేటి నుంచి గోదావరి జిల్లాలకు వచ్చే సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభం

-

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్‌. సంక్రాంతి పండుగ త్వరలోనే రానుంది. ఈ తరుణంలోనే… తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు హైదరాబాద్‌ నగరం నుంచి తరలివెళుతున్నారు జనాలు. ఈ తరుణంలోనే..నేటి నుంచి గోదావరి జిల్లాలకు వచ్చే సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభం అయినట్లు అధికారులు ప్రకటన చేశారు.

Reservation bookings for Sankranti trains to Godavari districts from today

సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఈ రైళ్ల రాకపోకలు ఉంటాయి. ఇక ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ స్పెషల్ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం ఉంటుంది. ఈ స్పెషల్ రైళ్ల ఏసీ, స్లీపర్, జనరల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news