విశాఖలో ఎమ్మార్వో రమణయ్య దారుణహత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయాలని విశాఖ పోలీసులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని స్పష్టం చేశారు. అటు ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఇక అటు ఏపీ జేఏసీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ….భూ మాఫీయా ఎమ్మార్వో రమణయ్యను దారుణంగా హత్య చేసిందన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం రమణయ్య హత్య చేసారని..దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో ఉరిశిక్ష వేయాలని..ఎమ్మార్వో కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
రమణయ్య భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి…ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. కాగా విశాఖ కొమ్మాదిలో తహసీల్దార్ రమణయ్య దారుణహత్యకు గురయ్యారు. చరణ్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి దాడి చేశారు. వాచ్‌మెన్ కేకలు వేయడంతో నలుగురు దుండగులు పరార్ అయ్యారు. అయితే… చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందాడు.